Undavalli Arun Kumar About Ramoji Rao | రామోజీరావు మరణంపై స్పందించిన ఉండవల్లి

Continues below advertisement

రామోజీరావు మరణం వార్త తనకు ఎంతో బాధను కలిగించిందని ప్రముఖ రాజకీయ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన ఎవరితోని రాజీ పడకుండా పూర్తి జీవితం గడిపారని తెలిపారు. ఆయనను కలుద్దామని తాను చాలాసార్లు ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. ఒక ఫైటర్ గానే ఆయన కాలం చేశారన్నారు. రామోజీరావు ఏ రంగంలోకి ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారని తెలిపారు. భారతదేశంలోనే ఇంత పలుకుబడి కలిగిన వ్యక్తిని మరెక్కడా చూడలేదన్నారు. ఆయనే లేనప్పుడు ఇంక ఆయనపై ఫైట్ ఉండదని స్పష్టం చేశారు.

తెలుగు పత్రికలు అంటే ఈనాడు ముందు ఈనాడు తర్వాత అని విశ్లేషించవచ్చు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సృష్టించిన సంచలనాలు అలాంటివి.తొలుత వార్తాపత్రికలు మరుసటి రోజు వచ్చేవి. ఆ తర్వాత దాన్ని మధ్యాహ్నానికి తీసుకురాగలిగారు. కానీ పేపర్ అంటే అది తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటి గుమ్మం ఉండాలనే ఒకే ఒక్క ఆలోచనలతో రామోజీరావు తెలుగు మీడియా రంగంలో సంచలనాలు సృష్టించారు. 1974లో విశాఖపట్నంలో కేవలం 5వేల కాపీలతో ప్రారంభమైన ఈనాడు టార్గెట్ ఒక్కటే. ఉషోదయానికి ముందే ఈనాడు ఉండాలి. అది పాఠకులకు విపరీతంగా నచ్చేసింది. తెల్లవారు జామునే లేచేసరికి ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోగలగటం పాఠకులను ఈనాడు పత్రికకు దగ్గర చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram