తమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కే
తమిళనాడు రాజకీయాల్లో అనుకున్నట్టే జరిగింది. సీఎం ఎమ్‌కే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్..డిప్యుటీ సీఎం అవుతారని చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సస్పెన్స్‌కి తెరదించుతూ అధికారికంగా ఆయనను డిప్యుటీ సీఎంగా ప్రకటించింది DMK ప్రభుత్వం. సీఎం ఎమ్‌కే స్టాలిన్...ఆయనకి కండువా కప్పి మరీ..ఆ బాధ్యతలు అప్పగించారు. నిజానికి ఎప్పుడో ఈ ప్రకటన రావాల్సింది. కానీ...పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఇది వాయిదా పడింది. డిప్యుటీ సీఎం అయినప్పటికీ పార్టీకి కొత్త నాయకుడిగా..ఆయనే ముందుండి నడిపిస్తారని చెబుతున్నాయి DMK శ్రేణులు. అప్పట్లో సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..ఒక్కసారిగా పాలిటిక్స్‌లో లైమ్‌లైట్‌లోకి వచ్చారు ఉదయనిధి స్టాలిన్. ఇక...తమిళనాట మరో స్టార్...తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పేరు, జెండాని కూడా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. DMK ప్రభుత్వంపై చాలా సందర్భాల్లో విమర్శలూ చేశారు. ఈ సమయంలోనే ఉదయనిధి స్టాలిన్‌కి డిప్యుటీ సీఎం పదవి వచ్చింది. పార్టీ బాధ్యతలన్నీ "మా తలపతివే" అంటోంది DMK. అంటే...ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపతి వర్సెస్ తలపతిగా ఉండనుందన్నమాట.