Tsunami Effect in Russia and Japan | జపాన్ లో తీరానికి కొట్టుకొస్తున్న తిమింగళాలు

రష్యాలోని కమ్చట్కా తీరంలో సంభవించిన భారీ భూకంపం సునామీగా మారింది. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతలో సంభవించిన భూకంపం కారణంగా జపాన్, అమెరికా, రష్యాలు పలు ప్రాంతాల్లో సునామీ సంభవించింది. పసిఫిక్ మహా సముంద్రంలో వచ్చిన సునానీ జపాన్ తీరాన్ని తాకింది. 3 మీటర్లకు పైగా రాకాసి అలలు ఎగసి పడుతుంటే.. తిమింగళాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. 

పలు చోట్ల తీరంలో రాకాసి అలల తాకిడి తిమింగళాలు చిన్న చేపల్లా తీరానికి కొట్టుకురావడం సునామీ తీవ్రతకు నిదర్శనం అని చెపొచ్చు. టొకచాయ్ పోర్టులో, ఎరిమో సిటీలో 40 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. 

సునామీ హెచ్చరికలతో జపాన్ లోని పలు ప్రాంతాల్లో ప్రజలు అపప్రమత్తమవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎయిర్ పోర్టులను మూసివేశారు. రష్యాలోని కమ్చట్కా లో వచ్చిన భారీ భూకంపం కారణంగా భవనాలు దెబ్బతిన్నాయి. భూమి కంపించిన సమయంలో భయాందోళనతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారని.. దెబ్బ తిన్న ఇళ్లను ప్రజలు ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola