TRS With Left Parties| వామపక్షాలతో పొత్తుతో..TRS భవిష్యత్ లో అద్భుతాలు చేస్తోందా..?| ABP Desam
మునుగోడు లో మద్దతు ఇచ్చినందుకు కమ్యూనిస్టులుకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఈ పొత్తు మునుగోడుకే పరిమితం కాదని.. భవిష్యత్ లోనూ కొనసాగుతుందని చెప్పారు. దీంతో... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. బీజేపీని అడ్డుకోవాలంటే కేసీఆర్ తో కలిసి నడవడమే మంచిదని సీపీఐ, సీపీఎం నేతలు నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల కోణంలోనే అదే మంచిదని...వామపపక్షాలు భావిస్తున్నాయి