Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్..
గత ఏడాది అంటే (2020)లో చాలా రోజులు కరోనా ఖాతాలో పడ్డాయి. లాక్‌డౌన్‌లో రోజులు లెక్కపెట్టుకున్న నెలలు ఉన్నాయి. అప్పుడు షూటింగులు లేవ్... సినిమా రిలీజులు లేవ్... బయట తిరుగుళ్లు లేవ్... వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది ఇంటి నుంచి అడుగు తీసి బయట వేస్తే ఒట్టు! ఆ సమయంలో ఓటీటీలో సినిమాలు చూడటం జనాలకు అలవాటు అయ్యింది. కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు కూడా చూశారు. ప్రపంచ సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సమయంలో వరల్డ్ సినిమాకు అలవాటు పడిన ప్రేక్షకుడు, మళ్లీ కమర్షియల్ తెలుగు సినిమా చూడటం కష్టమేనని విమర్శలు వచ్చాయి. కొంత మంది సందేహాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు కొంత మంది అన్ని సినిమాల కోసం థియేటర్లకు రావడం లేదు. కొన్ని సినిమాలు చూడటానికే థియేటర్లకు వస్తున్నారు. మరి కొన్ని సినిమాలు ఓటీటీలో వస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నారు.