Tirumala VIP Break Darshan | తిరుమలలో ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు |ABP Desam
తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల మార్పుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు ఛేంజ్ చేసి అమలు చేస్తామని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.