Vanga Geetha : ఏపీకి రావాల్సిన ధాన్యం కొనుగోళ్ల బిల్లులను విడుదల చేయాలని ఎంపీ డిమాండ్
రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తోందన్నారు కాకినాడ ఎంపీ వంగా గీత. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రూ.17,290 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం సమర్పించాల్సిన యూసీలన్నీ పంపించినా..ఎందుకు ఆలస్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. విభజన తర్వాత ఏపీ నష్టపోతున్నా..ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు.