Telangana Cabinet Meets Today: కరోనా నియంత్రణపైనే నేటి కేబినెట్ భేటీలో చర్చ | Covid |
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు మరోసారి ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత కర్ఫ్యూ విధించేందుకు యోచిస్తోంది. రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీటితో పాటుగా అర్హులందరికీ టీకాలు ఇవ్వడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడం వంటివాటిపైనా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ, వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ రూపకల్పనపైనా సమావేశంలో చర్చించనున్నారు.