సినిమా టికెట్ల ధరలు కాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్న టీడీపీ నేతలు..

రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు కాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సియం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, మైనారిటీ నాయకులు జీలానీ భాషా డిమాండ్ చేశారు. కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని, సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola