Tadepalligudem Lorry Accident: చేపల లారీ బోల్తా... పండుగ నాడే ఇలా ఎందుకు జరిగింది?
ఏపీలోని తాడేపల్లిగూడెంలో చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.