Suspicious Sadhu Movements: తూర్పుగోదావరి జిల్లాలో మూడురోజులుగా అనుమానాస్పదంగా సాధువులు
తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులుగా అనుమానస్పద రీతిలో సాధువులు తిరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. పి.గన్నవరం మండలంలో మూడురోజులుగా కార్ లో సాధువులు తిరుగుతుండగా తొలుత ఏదైనా ఆలయానికి వచ్చేరేమోనని సాధువులు భావించారు. కానీ మూడు రోజులుగా పరిసర పల్లెల్లో తిరుగుతున్న వారి గురించి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. పోలీసులు వారి వాహనం ఆపి ప్రశ్నించగా....యాత్రలో భాగంగా వచ్చామని తెలిపారు. దీంతో కరోనా నిబంధనలు ఉన్నందున బయటివ్యక్తులు ఇలా తిరగకూడదని వారిని విజయవాడ హైవే వైపు పంపించేశారు పోలీసులు.