Ap Government| పర్యావరణ అనుమతుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు| ABP Desam
Continues below advertisement
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ ఇటీవల ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఎన్జీటీ సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది.
Continues below advertisement