Supreme Court On Modi Security Issue : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో ఘటనపై స్వతంత్ర కమిటీ

Continues below advertisement

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భారీ భద్రతా వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీం విచారణ జరిపింది. ఘటనపై స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు CJI జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఈ కమిటీలో పంజాబ్ నుంచి చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ ఐ ఏ ఐజీ కూడా సభ్యులుగా ఉంటారని స్పష్టం చేసింది. కమిటీ ఏర్పాటుపై అభ్యంతరాలు లేవని పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకు తెలిపాయి. ఇంతకుముందు కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలు వేసిన కమిటీల దర్యాప్తుపై స్టే అలాగే కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram