SS Rajamouli on Ramoji Rao Demise | రామోజీరావు పార్ధివదేహానికి నివాళులు అర్పించిన రాజమౌళి

అటు పాత్రికేయ రంగానికి ఇటు సినిమా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావును భారత రత్నతో గౌరవించాలని డైరెక్టర్ రాజమౌళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పార్ధివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. తన అన్న కీరవాణి కుటుంబంతో కలిసి వచ్చిన రాజమౌళి రామోజీ రావు పార్ధివ దేహం వద్ద భావోద్వేగానికి లోనయ్యారు.

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పార్ధివ దేహానికి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి నివాళులు అర్పించారు. తన అన్న కీరవాణి కుటుంబంతో కలిసి వచ్చిన రాజమౌళి రామోజీ రావు పార్ధివ దేహం వద్ద భావోద్వేగానికి లోనయ్యారు. రామోజీరావును ఉంచిన పెట్టె మీద తన ఆన్చి చాలా సేపు ఎమోషనల్ అయ్యారు. కీరవాణి, రాజమౌళి రామోజీ రావు కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామోజీరావు తనకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని రాజమౌళి గతంలో అనేక సార్లు ప్రకటించిన. పని మీద నిబద్ధత, ఆయన చూపించే పట్టుదల, క్రమశిక్షణ తనను ఎప్పుడూ మోటివేట్ చేస్తాయని రాజమౌళి తెలిపారు. రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకువచ్చిన బాహుబలి, RRR సినిమాల నిర్మాణం అంతా రామోజీ ఫిలిం సిటీలోనే జరగగా..ఆ సమయంలో రామోజీ రావు తనకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చే వారని గతంలో రాజమౌళి అనేక ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola