Sai Kumar on Ramoji Rao Demise | రామోజీరావు పార్ధివదేహానికి సాయికుమార్ నివాళులు

Continues below advertisement

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు సినీనటుడు సాయి కుమార్.

1974లో విశాఖపట్నంలో కేవలం 5వేల కాపీలతో ప్రారంభమైన ఈనాడు టార్గెట్ ఒక్కటే. ఉషోదయానికి ముందే ఈనాడు ఉండాలి. అది పాఠకులకు విపరీతంగా నచ్చేసింది. తెల్లవారు జామునే లేచేసరికి ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోగలగటం పాఠకులను ఈనాడు పత్రికకు దగ్గర చేసింది. ఆంధ్ర అనే శబ్దంతో మొదలైన పత్రికలు ఎక్కువగా ఉండే రోజుల్లో ఈనాడు అని తెలుగు పేరు పెట్టిన రామోజీరావు..ఫాంట్ లోనూ పబ్లికేషన్ ప్లేసుల్లోనూ సరికొత్తకు తెరతీశారు. జిల్లాకు ప్రత్యేకంగా పత్రికలను తీసుకురావటం ఈనాడుకు మరింత మందిని దగ్గరయ్యేలా చేసింది. కార్టూన్లు, మహిళకు ప్రత్యేక పేజీలు, రైతుల కోసం స్పెషల్ కాలమ్స్ అన్నీ కలిసి ఈనాడు పేరును ఓ బ్రాండ్ గా మార్చారు రామోజీ రావు. ఆయన పత్రికలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తెలుగు వాళ్ల జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలనే వాడమని రామోజీ రావు ఆయన పాత్రికేయులకు సూచించేవారు. చదవటానికి ఇబ్బందిగా ఉన్నా భాషను బతికించుకోవాలంటే అదొక్కటే దారి అని ఆయన భావించేరావు. అలా అనేక విలువలతో ఈనాడు పత్రిక తెలుగు వాళ్ల జీవితంలో ఓ భాగంగా మారి తెలుగు మీడియా రంగంలో నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram