RGV-Minister Perni Nani : ఏపీ సచివాలయానికి రామ్ గోపాల్ వర్మ
Continues below advertisement
కొన్ని రోజుల ట్వీట్ల యుద్ధం తర్వాత సంచలన దర్శకుడు ఆర్జీవీ, మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. ఈ మేరకు అమరావతిలోని ఏపీ సచివాలయానికి రామ్ గోపాల్ వర్మ చేరుకున్నారు. లోపలికి వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు. తాను పరిశ్రమ తరఫున రాలేదని, ఓ సినీ దర్శకుడిగానే వచ్చానన్నారు. నాగార్జున ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనన్న వర్మ.... ఎవరి అభిప్రాయాలు వారివన్నారు. సినిమా టిక్కెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని తెలియచేస్తానన్న వర్మ... తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
Continues below advertisement