PM Modi meeting China President XI Jinping | జిన్‌పింగ్‌తో మోదీ
ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తనను ఎస్‌సీఓ సమ్మిట్ కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్-చైనా సంబంధాలు.. నమ్మకం, గౌరవంతో ముందుకు వెళ్ళడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. సైన్యం ఉపసంహరణ తర్వాత బోర్డర్ లో శాంతి, స్థిరత్వం నెలకుందని అన్నారు ప్రధాని మోదీ. అలాగే జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనాలు స్నేహితులుగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. భారత్ చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు.. గ్లోబల్ సౌత్‌లో స్నేహితులుగా ఉండటం, డ్రాగన్- ఏనుగు కలిసి నడవడం చాలా ముఖ్యం’ అని స్పష్టం చేశారు. చైనాలో పర్యటించేందుకు, ఎస్సీవో సదస్సుకు తనను ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు నిశ్చయించుకున్నామని అన్నారు. జిన్‌పింగ్ విజయవంతమైన అధ్యక్షుడు అని మోదీ అభినందించారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగాదెబ్బతిన్న విషయం తెలిసిందే. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీ టారిఫ్‌లు మోపుతున్నాడు. చైనాతోనూ ట్రంప్‌కు పలు విబేధాలున్నాయి. ఈక్రమంలో భారత్, చైనా నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.