Pigeon : కాళ్లకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాగ్ తో కనిపిస్తున్న పావురాళ్లు
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ పావురం కలకలం రేకెత్తించింది. కాళ్లకి పసుపు రంగుతో ట్యాగ్ ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు. ట్యాగ్ పై AIR 2207 అని కోడ్ నెంబర్ కూడా ఉంది. ఒడిశాలో చైనాకి సంబంధించిన రెండు పావురాళ్లను స్థానికులు గుర్తించిన నేపథ్యంలో చీమకుర్తికి వచ్చిన పావురం కూడా చైనా పావురం అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాళ్లకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాగ్ తో కనిపిస్తున్న పావురాళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో తేలాల్సి ఉంది.