Pawan Kalyan On Ramoji Rao Demise | రామోజీరావుకు నివాళులు అర్పించిన పవన్‌కళ్యాణ్

రామోజీ రావుకు పవర్‌స్టార్, ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్ నివాళులు అర్పించారు.

 

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులు అర్పించారు. రామోజీ మరణ వార్త విని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన బయల్దేరి వచ్చిన చంద్రబాబు..తన భార్య భువనేశ్వరితో కలిసి రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు...ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ  సానుభూతి తెలియచేశారు.

తెలుగు పత్రికలు అంటే ఈనాడు ముందు ఈనాడు తర్వాత అని విశ్లేషించవచ్చు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సృష్టించిన సంచలనాలు అలాంటివి.తొలుత వార్తాపత్రికలు మరుసటి రోజు వచ్చేవి. ఆ తర్వాత దాన్ని మధ్యాహ్నానికి తీసుకురాగలిగారు. కానీ పేపర్ అంటే అది తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటి గుమ్మం ఉండాలనే ఒకే ఒక్క ఆలోచనలతో రామోజీరావు తెలుగు మీడియా రంగంలో సంచలనాలు సృష్టించారు. 1974లో విశాఖపట్నంలో కేవలం 5వేల కాపీలతో ప్రారంభమైన ఈనాడు టార్గెట్ ఒక్కటే. ఉషోదయానికి ముందే ఈనాడు ఉండాలి. అది పాఠకులకు విపరీతంగా నచ్చేసింది. తెల్లవారు జామునే లేచేసరికి ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోగలగటం పాఠకులను ఈనాడు పత్రికకు దగ్గర చేసింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola