Pawan Kalyan|కాపు రిజర్వేషన్ల సాధన దీక్ష విరమించిన మాజీ మంత్రి హరిరామజోగయ్య | ABP Desam
కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామజోగయ్య..జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు దీక్ష విరమించారు. ఉదయం నుంచి దీక్ష కొనసాగిస్తున్న హరిరామజోగయ్య కు..పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్ష చేస్తున్నారని.. ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు..