Palvancha Tragedy: పాల్వంచలో సిలిండర్ పేలి ముగ్గురి మృతి ఘటనలో మరో కోణం

భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉదయం గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతి కోణం మారిపోయింది. ఉదయం ఆత్మహత్యగానే భావించిన స్థానికులు అనంతరం దొరికిన మరణ వాంగ్మూలం దొరకడంతో పాటు మృతుడి కుమార్తె వాంగ్మూలంతో కేసు మరో కోణంలోకి మారింది. ఇందులో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావుపై కేసు నమోదు కావడం గమనార్హం. పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సాహితి ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందారు. మరో కుమార్తె సాహిత్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఉదయం ప్రమాదం జరగగానే గ్యాస్‌ సిలండర్‌ పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుడు నాగ రామకృష్ణ రాసిన సూసైడ్‌ లేటర్‌ లభించడం, ప్రస్తుతం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సాహిత్య వాంగ్మూలంతో దీనిని ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ ఆత్మహత్యను ప్రేరేపించినట్లుగా భావించిన కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావు రామకృష్ణ సోదరిపై కేసు నమోదు చేసినట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ వెల్లడించారు. కాగా పాల్వంచలో ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యల్లో రెండు కేసుల్లో వనమా రాఘవేంద్రరావు పై కేసు నమోదు కావడం గమనార్హం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola