OTT Releases: హాట్ స్టార్ లో ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్
శుక్రవారం వస్తోందంటే.. ఏవోక సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అది థియేటర్ల వరకే పరిమితం అనుకుంటూ పొరపాటే. కొవిడ్ తర్వాత అన్నీ మారాయి. చాలా వరకూ జనాలు థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు చూస కాలక్షేపం చేసేస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలను సైతం ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. జనవరి 28న హాట్ స్టార్ లో ఐస్ ఏజ్- అడ్వంచర్స్ ఆఫ్ బక్ వైల్డ్, తడప్ సినిమాలు రానుండగా.. నెట్ ఫ్లిక్స్ లో all of us are dead అనే కొరియన్ సినిమా రానుంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో గమనం సినిమా రానుంది.