Operation Cambodia Success | విదేశీ ఉద్యోగాల పేరుతో నమ్మించి సైబర్ క్రైమ్ లు

Continues below advertisement

విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు ఎర చూపించారు. ఒక్కొక్కర్ని నమ్మించి లక్షన్నర చొప్పున వసూలు చేశారు. తర్వాత చైనా, కంబోడియా దేశాల ఏజెంట్లకు అప్పగించారు. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది ఏంటంటే వీళ్లంతా ఇండియా మీదనే సైబర్ క్రైమ్ తో దాడులు చేయాలి. ఎదురుతిరిగిన వాళ్లకు చిత్రహింసలు. పాస్ పోర్టులు లాగేసుకున్నారు. అలా కంబోడియా లో చిక్కుకు పోయిన 58మంది బాధితులను తిరిగి మన దేశానికి రప్పించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ.

విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు ఎర చూపించారు. ఒక్కొక్కర్ని నమ్మించి లక్షన్నర చొప్పున వసూలు చేశారు. తర్వాత చైనా, కంబోడియా దేశాల ఏజెంట్లకు అప్పగించారు. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది ఏంటంటే వీళ్లంతా ఇండియా మీదనే సైబర్ క్రైమ్ తో దాడులు చేయాలి. ఎదురుతిరిగిన వాళ్లకు చిత్రహింసలు. పాస్ పోర్టులు లాగేసుకున్నారు. అలా కంబోడియా లో చిక్కుకు పోయిన 58మంది బాధితులను తిరిగి మన దేశానికి రప్పించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. రెండు విమానాల్లో విశాఖకు చేరుకున్న 24మందికి విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్వాగతం పలికారు. తర్వాత మీడియా మాట్లాడుతూ బాధితులతో మాట్లాడి అక్కడ ఇండియాపైన ఏం చేస్తున్నారో వివరాలను రాబడతామని..వీళ్లను పంపిన ఏజెంట్లపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితుల ఫోన్లలో తీసిన చిత్రాలు, సేకరించిన వివరాలతో విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కాంబోడియా ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని సీపీ రవిశంకర్‌ తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram