జమిలి ఎన్నికల బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

Continues below advertisement

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్‌ని మోదీ సర్కార్ వెనక్కి తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో  ఉన్నట్టుండి ట్విస్ట్ ఇచ్చింది కేంద్రం. లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. అలా ఆ ప్రస్తావన తీసుకొచ్చారో లేదో..అప్పుడే సభలో గందరగోళం మొదలైంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అని ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సహా ఆర్‌జేడీ, టీఎమ్‌సీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు పేరుతో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను కుదించడానికి ఏ మాత్రం అంగీకరించమని తేల్చి చెబుతున్నాయి. ఈ బిల్ అమల్లోకి వస్తే...ఎన్నికల సంఘానికి అధికారాలు పూర్తిగా పెరిగిపోతాయని వాదిస్తోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అయితే..కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏకి 295 మంది సభ్యుల బలం ఉంది. అటు ఇండీ కూటమికి 235 మంది సభ్యులున్నారు. లోక్‌సభలో ఈ బిల్ పాస్ అవ్వాలంటే 362 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. మొత్తంగా పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీని సాధిస్తే..ఈ బిల్ పాస్ అవడానికి వీలుంటుంది. అయితే..మూడింట రెండొంతుల మెజార్టీ లేనప్పుడు బిల్లుని ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలు. ఈ కారణంగా సభలో గందరగోళం నెలకొంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram