15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి కోవాగ్జిన్ ను సిద్దం చేసిన అధికారులు
Continues below advertisement
ఈ నెల 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు 15 నుంచి 18 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణి చేపట్టారు. సచివాలయాల్లో, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కోవిడ్ టీకా కోవాగ్జిన్ ను అందిస్తున్నారు. యువతీ యువకులందరికీ 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు వారి సమీపంలో గల సచివాలయాల్లో, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కోవిడ్ టీకా కోవాగ్జిన్ వేయడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు అర్హులైన వారి పిల్లలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా కేంద్రాలకు తీసుకువచ్చి కోవిడ్ టీకాలను ఇప్పించి సహకరించాలని సూచించారు.అపోహలకు తావులేకుండా టీకాలు వేయించుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు.
Continues below advertisement