New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను ఆన్లైన్ లోనే పంపి వారి ఆమోదం తీసుకుంది. సీఎస్ సమీర్ శర్మ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశాలున్నాయి.