New Districts In AP : కొత్త జిల్లాల ఏర్పాటు తో అధికార పక్షంలో సందడి వాతావరణం..
కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత వైసీపీ నేతలు దూకుడు పెంచేందుకు యత్నిస్తున్నారు. కృష్ణాజిల్లా ను రెండు జిల్లాలు గా విభజించిన నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును ఎపీ ప్రభుత్వం ప్రకటించింది.దీని పై టీడీపీ నేతలు సైలెంట్ గా ఉన్నా,వైసీపీ నేతలు మాత్రం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్ కు అసలయిన నివాళి ఇప్పుడే అని అంటున్నారు.తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కు సీఎం జగన్ నిజమయిన నివాళర్పించారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు..