Nellore : ఉమ్మడి నెల్లూరులో ఇవే చివరి ఉత్సవాలు.

రిపబ్లిక్ డే సంబరాల్లో జెండా వందనం తర్వాత మఖ్యమైన ఘట్టం శకటాల ప్రదర్శన. అన్ని శాఖలు శకటాల ప్రదర్శనలో పోటీపడతాయి. నెల్లూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. డీఆర్డీఏ శకటం, వ్యవసాయ శాఖ నుంచి ఆర్బీకే, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం శకటాలు ఆకట్టుకున్నాయి. సచివాలయ డిపార్ట్ మెంట్ ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. ఇక కొవిడ్ వ్యాక్సినేషన్లో నెల్లూరు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని చాటి చెబుతూ, వైద్య ఆరోగ్య శాఖ శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ సర్వే టీమ్ తో ప్రత్యేక శకటాలతో పరేడ్ లో సందడి చేశాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola