Narendra Modi Meditation | స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌లో నరేంద్ర మోదీ ధ్యానం

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూడండి.

 

దేశంలో చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు గురువారంతో ముగిసింది. ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నారు. అక్కడ సుమారు రెండు రోజుల పాటు ధ్యానం చేస్తారు. 2019 ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ కేదార్ నాథ్‌కు వెళ్లి అక్కడ రుద్ర గుహలో ధ్యానం చేశారు. అంతకుముందు 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. తాజాగా తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు.కన్యాకుమారిలో స్వామి వివేకానందకు భారత మాత దర్శనం కలిగిందని చెబుతారు. స్వామి వివేకానంద 1893లో ప్రపంచ మతాల మండలిలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లేముందు 1892 డిసెంబర్ 24న కన్యాకుమారిని సందర్శించారని ప్రచారంలో ఉంది. సముద్ర తీరానికి దాదాపు 500 మీటర్ల దూరంలో నీటి మధ్య భారీ బండ కనిపించింది. స్వామి వివేకానంద ఈదుకుంటూ అక్కడికి చేరుకుని ధ్యానంలో మునిగిపోయారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola