Narendra Modi cabinet with Portfolio's List |తెలుగు వాళ్లకు కేటాయించిన శాఖల్లో ఇది గమనించారా..?

Continues below advertisement

మోదీ 3.0 మంత్రులకు శాఖలు కేటాయించారు. ప్రమాణస్వీకారం ఆదివారం రాత్రి జరిగినప్పటికీ.. 24 గంటల తరువాతే ఆ మంత్రులకు శాఖలు కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో చూసుకుంటే... బీజేపీ అగ్రనేతల్లో చాలా మందికి లాస్ట్ టైం చేసిన శాఖల్నే కేటాయించారు. అమిత్ షా కు హోం మంత్రిత్వ శాఖ... రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖ... నితిన్ గడ్కరీకి రోడ్లు, జాతీయ రహదారులు శాఖ.. జైశంకర్ కు విదేశీ వ్యహరాలు, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ... అశ్వీని వైష్ణవ్ రైల్వే అండ్ ఐటీ శాఖలు కేటాయించారు. మోదీ 2.0 ప్రభుత్వంలోనూ వీళ్లు ఇదే శాఖలు నిర్వర్తించండం ఆసక్తికరంగా మారింది. ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించారు. 2014 మోదీ కేబినెట్ లోనూ టీడీపీకి ఇదే శాఖ కేటాయించడం విశేషం. అప్పుడు అశోక్ గజపతిరాజు మంత్రిగా ఉన్నారు. కొత్తగా ఎంపీ ఐన పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణ అభివృద్ధి,కమ్యూనికేషన్స్ శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించనున్నారు. బీజేపీ నుంచి భూపతి శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖకు సహాయ మంత్రిగా ఉండనున్నారు. ఇక....తెలంగాణ విషయానికొస్తే... కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ కేటాయించారు. గత ప్రభుత్వం కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. ఇక.. బండి సంజయ్ హోం మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రిగా ఉండనున్నారు. ఫస్ట్ టైమ్ సహాయ మంత్రి ఐనప్పడు కిషన్ రెడ్డి ఇదే శాఖలో పని చేశారు. అప్పుడు , ఇప్పుడు హోం మంత్రి అమిత్ షానే. అంటే..అమిత్ షా చూసే శాఖకు సహాయ మంత్రిగా పనిచేయడం బండి సంజయ్ కు ప్లస్ గా మారే అవకాశం ఉంది. అమిత్ షాతో , దిల్లీ పెద్దలతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. ఇవే కాకుండా.. మీడియాలో బాగా వినిపించే నేతల విషయానికొస్తే.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం 
శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం,గ్రామీణాభివృద్ధి చూడనున్నారు. పియూష్ గోయల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ ..కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు.. జేడీయూ నుంచి కుమారస్వామి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలను చూడనున్నారు. ఇక..కేరళ నుంచి ఎన్నికైన తొలి ఎంపీ ,నటుడు సురేశ్ గోపి.. పెట్రోలియం, సహజ వనరులు, పర్యాటకం శాఖలకు సహాయ మంత్రిగా ఉండనున్నారు. ఓవరాల్ గా... మోదీ కేబినెట్ 3.0లో కీలక శాఖలకు సంబంధించిన విషయాలు ఇవి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram