Nandamuri Balakrishna: బసవతారతకం ఆసుపత్రిలో నాలుగో డే కేర్ యూనిట్
మరింతమంది క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నాలుగో డే కేర్ యూనిట్ ను ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వార్డుల్లో సదుపాయాలను పరిశీలించి వివిధ బాధితులతో మాట్లాడారు. ఇప్పుడు డే కేర్ చికిత్సకు మొత్తం మీద 181 పడకలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. భారతదేశంలోనే లాభాపేక్షలోని అత్యుత్తమ ట్రస్ట్ హాస్పిటల్ గా బసవతారకం ఆసుపత్రిని నీతి ఆయోగ్ గుర్తించడం పట్ల బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.