మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్

Continues below advertisement

మైసూరు దసరా ఉత్సవాల కోసం కర్ణాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో చివరి రోజు చాలా స్పెషల్. ఎంతో గ్రాండ్‌గా ఈ ఉత్సవాల్ని ముగిస్తారు. ఆ రోజే జంబో సఫారీ కూడా ఉంటుంది. మొత్తం 14 ఏనుగులను అందంగా అలంకరిస్తారు. చివరి రోజు ఈ 14 ఏనుగులతో సఫారీ చేస్తారు. అభిమన్యు అనే ఏనుగు 750 కిలోల బరువున్న బంగారు హౌదాని మోస్తూ ఈ సఫారీలో పాల్గొంటుంది. ఈ ఏనుగులన్నింటికీ అభిమన్యుయే క్యాప్టెయిన్. ఈ సఫారీలో పాల్గొంటున్న ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. ప్రత్యేకమైన ఫుడ్ పెడతారు. పెసళ్లు, గోధుమలు, చెరకు, బెల్లం అందిస్తున్నారు. వీటితో పాటు రకరకాల కూరగాయలు, పండ్లు కూడా పెడుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు మొదలయ్యే దసరా వేడుకలు..విజయదశమితో ముగుస్తాయి. ఈ వేడుకల కోసం ఇలా ఏనుగులను ప్రత్యేకంగా తెప్పిస్తారు. వాటికి ట్రైనింగ్ ఇచ్చి..స్పెషల్‌ ఫుడ్ పెట్టి ఉత్సవాల్లో వాటిని ప్రవేశపెడతారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram