Mumbai Flyover: ముంబయిలో కుప్పకూలిన ఫ్లైఓవర్.... 14 మందికి గాయాలు
మహారాష్ట్ర ముంబయి బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కూలింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.