MP GVL : వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీకి ప్రత్యర్థి పార్టీలే
Continues below advertisement
ప్రజాగ్రహసభకు వచ్చిన స్పందన చూసాక ఏపీ ప్రభుత్వం గుండెల్లో రాళ్లు పడ్డాయన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు . అందుకే సీఎం జగన్ వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసారని ఆరోపించారాయన. ఢిల్లీ నుంచి నిధులు వస్తుంటే ఇక్కడ వైసీపీ తన స్టికర్లు వేసుకుంటోందన్న జీవీఎల్ వైసీపీ ,టీడీపీ రెండూ తమకు ప్రత్యర్థులేనన్నారు . రెండురోజుల పర్యటన కోసం వైజాగ్ వచ్చిన ఆయన నగర పరిసర ప్రాంతాల్లో కేంద్ర నిధులతో నడుస్తున్న సంస్థలను ,అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు . అలాగే ఏపీ పై బీజేపీకి సడన్ గా ప్రేమ పుట్టలేదనీ మొదటినుండీ ఏపీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది తమపార్టీ నేననీ తెలిపారు
Continues below advertisement