Mouni Roy Wedding Pics: మళయాళీ స్టైల్ లో నాగిని ఫేం మౌనీ రాయ్ పెళ్లి
నాగిని సీరియల్ ఫేం, బాలీవుడ్ నటి మౌనీరాయ్ కు కేరళకు చెందిన సూరజ్ నంబియార్ తో వివాహమైంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నా స్పందించని మౌనీ రాయ్.. ఆమె పెళ్లి ముహుర్తానికి కొద్ది గంటల ముందు.. సూరజ్ తో ఉన్న పిక్స్ షేర్ చేశారు. ఆ తర్వాత.. వీరిద్దరి వివాహ మహోత్సానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. గోవాలో కేరళ హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది.