MLC JeevanReddy: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, ఒక వేళ జాతీయ హోదా వస్తే.. కేసీఆర్ లోపాలు బయట పడతాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై ధ్వజమెత్తారు.సరైన ప్రణాళిక లేకుండానే కమీషన్ల కోసం పడ్డ కక్కుర్తి అంతా ఇప్పుడు ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే జాతీయహోదా ప్రయత్నాలు పూర్తిగా మానుకున్నారని మండిపడ్డారు. తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే కాళేశ్వరం నిర్వహణ కేంద్రం చేతుల్లోకి వెళ్ళనివ్వడం లేదన్నారు. రాష్ట్రం పై కేసీఆర్ చేసిన అప్పులతో ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు.