తిరుపతి ఎమ్.జె.ఎమ్.లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన
వ్యాక్సినేషన్ తోనే కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తి స్ధాయిలో కట్టడి చేయవచ్చని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టేడ ఎమ్.జె.ఎమ్.ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో, విద్యా సంస్థలలో,పి.హెచ్.సి,ఆరోగ్య కేంద్రాల్లో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు డ్రైవ్ మోడ్ లో వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.