Mithali Raj Meets JP Nadda : జేపీ నడ్డాతో సమావేశమైన మిథాలీ రాజ్ | ABP Desam
Continues below advertisement
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇండియన్ మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు పుష్పగుచ్ఛం అందించారు. నడ్డాతో భేటీ అనగానే మిథాలీ కూడా రాజకీయాల్లోకి వెళ్తారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎందుకంటే... మిథాలీ రాజ్ జూన్ లో రిటైర్మెంట్ ప్రకటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాల్లో మెుదలుపెడుతోందనే వాదనలు ఉన్నాయి. ఐతే.. ఈ సమావేశం వెనుక ఏ రాజకీయ కోణం లేదు. కేవలం మర్యాద పూర్వకంగానే కలిశారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు.
Continues below advertisement