Meghalaya Governor criticises Modi: ప్రధాని మోదీ అహంతో ప్రవర్తించారు..!

ప్రధాని మోదీ గర్వం, అహంతో ప్రవర్తించారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. హరియాణాలోని దాద్రిలో ఓ సమావేశంలో మాట్లాడిన మాలిక్... "నూతన సాగు చట్టాలు, రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రధాని మోదీతో భేటీ అయ్యా. 500 మంది రైతులు మరణించారని నేను అంటే... నా కోసం మరణించారా అని మోదీ అన్నారు. ప్రధానిగా ఉన్నది మీరే కాబట్టి మీ కోసమే చనిపోయారని అన్నాను. మా ఇద్దరి మధ్య సుమారు 5 నిమిషాల వాగ్వాదం జరిగింది. నన్ను అమిత్ షాను కలవమన్నారు. కలిశాను" అంటూ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధానిపై విమర్శలు చేశారు. భాజపా ప్రభుత్వం నియమించిన గవర్నర్ మాటలనే మోదీ వినే స్థితిలో లేరంటే... ఆయన అహంకారం అర్థమవుతోందని విమర్శించారు. కేవలం స్తుతి చేసేవారినే మోదీ విశ్వసిస్తారు తప్ప, వాస్తవాలను చెప్పేవాళ్లను కాదని మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola