Medaram: మేడారం జాతర పనులు, అధికారుల తీరుపై భక్తులు, స్థానిక ప్రజలు అసంతృప్తి.
మేడారం జాతర సమీపిస్తున్నా కాని జాతర పనులు ముందుకు సాగడం లేదు. రెండేళ్లకు ఒక సారి నిర్వహించే మేడారం జాతర పనులపై అధికారులు నిర్వహిస్తున్న తీరుపై భక్తులు స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించే మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరు చేసింది. అయితే అధికారులు, క్రాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు నత్తనడక సాగుతున్నాయి.