Medaram Arrangements: శరవేగంగా సాగుతున్న మహాజాతర ఏర్పాట్లు
Continues below advertisement
మేడారం మహా జాతరకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, అదనపు సిబ్బందిని నియమించామన్నారు. ప్రతి రోజు రెండుసార్లు ఫాగింగ్ చేస్తామన్నారు. మహాజాతర పనులను, రహదారులను పరిశీలించిన ఆమె.... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈసారి శాశ్వత నిర్మాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
Continues below advertisement