Mamatha Banerjee: ట్విట్టర్ లో గవర్నర్ ధన్ కర్ ను బ్లాక్ చేసిన బంగాల్ సీఎం మమత

బంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తాజాగా వివాదం మరింత ముదిరింది. ఎంతలా అంటే ఏకంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ట్విట్టర్ ఖాతాను సీఎం దీదీ బ్లాక్ చేసేశారు. గవర్నర్ జగదీప్ ధన్‌కర్.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. బంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని గవర్నర్ బెదిరిస్తున్నారని కోల్​కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో దీదీ తీవ్ర ఆరోపణలు చేశారు.అంతేకాకుండా తమ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారుల ఫోన్లను గవర్నర్ ట్యాప్ చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆయన్ను ఇప్పటివరకు మోదీ ఎందుకు బాధ్యతల నుంచి తొలగించలేదని ప్రశ్నించారు. పెగాసస్.. గవర్నర్ ఇంటి నుంచే ఆపరేట్ అవుతోందని సంచలన ఆరోపణలు చేశారు.మమతా బెనర్జీ మీడియా సమావేశం పూర్తయిన కాసేపటికే గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఓ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్‌లో గవర్నర్ హక్కులు, బాధ్యతల గురించి ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola