Kukatpally shiva parvathi Theatre| శివ పార్వతి ధియేటర్ లో అగ్నిప్రమాదం
కూకట్ పల్లి, కె.పి.హెచ్ బి కాలనీ శివ పార్వతి ధియేటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..ఈ ప్రమాదంలో థియేటర్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది..థియేటర్ లో వేకువజామున 3.30 గంటల సమయంలో శబ్దాలు వస్తుండటం గమనించిన వాచ్ మ్యాన్ పోలీసులకు సమాచారం అందించాడు. లోపలున్న కుర్చీలు, ప్రొజెక్టర్లు, స్క్రీన్, dts సౌండ్ సిస్టం పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు..ఆస్తి నష్టం 2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.