KTR on Ramoji Rao Demise | తెలుగు భాష కోసం రామోజీరావు చేసిన కృషి వెలకట్టలేనిది

Continues below advertisement

రామోజీ రావు విజనరీ అని మొబైల్ ఎన్ సైక్లో పీడియా అని కీర్తించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలుగు భాష కోసం రామోజీరావు చేసిన కృషి మర్చిపోలేదన్నారు కేటీఆర్.

ఫిలిం స్టూడియో అంటే అప్పటి వరకూ హాలీవుడ్. ఇండియాలో సినిమాలు తీయాలంటే అవుట్ డోర్ లొకేషన్లు వెతుక్కోవాల్సిందే. ఒకవేళ అవుట్ డోర్లకు వెళ్లినా షూటింగ్ కావాల్సిన సరంజామా అంతా వెనుకేసుకుని వెళ్లాల్సి రావటం నిర్మాతకు అదనపు ఖర్చు. ఇలాంటి సినిమా కష్టాలను దూరం చేయటానికి తెలుగు సినిమా రాతను మార్చటానికి రామోజీ రావు చేసిన ఆలోచనే రామోజీ ఫిలిం సిటీ. 1996లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ అనే కుగ్రామంలో 1666 ఎకరాల విస్తీర్ణంలో రామోజీ రావు నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గా ఈ రోజు ఇండియన్ ఫిలిం మేకర్స్ కి కనిపించే ఏకైక డెస్టినేషన్. డైరెక్టర్ తన మైండ్ లో థాట్ అండ్ కాస్ట్ అండ్ క్రూ తో ఫిలిం సిటీకి వస్తే చాలు మిగిలినవి మేం చూసుకుంటాం అంటూ మొదలైన RFC ఎన్నో వేల సినిమాలకు పురిటి గడ్డ అయ్యింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన బాహుబలి, RRR  సినిమాలను రామోజీ ఫిలిం సిటీలోనే ఎస్ ఎస్ రాజమౌళి తీశారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram