Krishnayapalem: అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కోసం ప్రజాభిప్రాయ సేకరణ
19 గ్రామ పంచాయతీలతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించగా...స్థానికుల నుంచి వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. బుధవారం కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ రోజు కృష్ణాయపాలెంలో గ్రామసభను నిర్వహించిన మంగళగిరి ఎంపీడీవో...అమరావతి కార్పొరేషన్ లో విలీనానికి అంగీకారం కోరారు. ఒక్కరంటే ఒక్కరు కూడా చేతులెత్తకపోవటంతో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం ఏకగ్రీవమైంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయం వచ్చిన్నట్లుగా మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న ప్రకటించారు.