Krishna Reddy: వివేకా హత్యకేసులో ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన పీఏ
వివేకా హత్యకేసులో తనను కొందరు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారంటూ వైఎస్ వివేకా వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి పోలీసులును ఆశ్రయించారు. కడప ఎస్పీ అన్బురాజన్ ని కలిసిన కృష్ణారెడ్డి....వివేకా కుమార్తె సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాష్ రెడ్డి ల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి తను ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి వినతిపత్రం అందించారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అనంతరం మాట్లాడిన ఎస్పీ అన్బురాజన్... వివేకా ఇంట్లో 30 ఏళ్లుగా కృష్ణారెడ్డి పీఏ గా పని చేశారన్నారు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కృష్ణారెడ్డి.....కొందరి వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు