Kohli-Ganguly Rift : విరాట్-సౌరవ్ మధ్య విభేదాలకు అదే కారణమా? | BCCI | Cricket
విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలకు సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. తను టీ20 కెప్టెన్సీ వదిలేశాక, ఎవరూ తనను కొనసాగాలని కోరలేదని గతంలో కోహ్లీ చెప్పాడు. అయితే అంతకుముందే విరాట్ ను కొనసాగాలని కోరినట్టు గంగూలీ చెప్పాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాకు బయల్దేరే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపుపై గంటన్నర ముందే చెప్పారన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీకి షోకాజ్ నోటీస్ జారీ చేసేందుకు గంగూలీ సిద్ధపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని బోర్డు ముందుకు తీసుకెళ్లగా.. బోర్డు సభ్యులు దానికి వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో షోకాజ్ నోటీస్ జారీ అవలేదు కానీ, గంగూలీ అప్పటికే దాని కోసం రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో పాటుగా.... టెస్టు కెప్టెన్సీ రాజీనామా గురించి... కార్యదర్శి జై షాకు కోహ్లీ ఫోన్ చేశాడే తప్ప, సౌరవ్ కు చేయలేదన్న విషయం... వారి మధ్య విభేదాలు నిజమే అని తెలిసేలా చేస్తోంది.