Kinnera Mogulaiah: దర్శనం మొగులయ్యకు రూ. కోటి ఇచ్చిన సీఎం కేసీఆర్
భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన మొగులయ్య గుర్తున్నారా? అదే రీసెంట్ గా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్యకు Telangana CM KCR ఘనంగా సత్కరించారు. ఆయనకు రూ. కోటి నజరానా ప్రకటించారు. హైదరాబాద్ లో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం ఈ బహుమతిని అందజేసి శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించ దగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడు అని కేసీఆర్ అన్నారు.