Karimnagar హస్తకళకు జాతీయస్థాయి గుర్తింపు, సిల్వర్ ఫిలిగ్రీ వెండి పల్లకికి అవార్డు|DNN|ABP Desam
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రి కళకి ఇప్పుడు మరో జాతీయస్థాయి అవార్డు దక్కింది. గద్దె అశోక్ కుమార్ అనే కళాకారుడు 2018లో కిలోన్నర వెండి తీగలతో వెండి పల్లకిని అద్భుతంగా తయారుచేశారు. దీనికి ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది.