Kadapa Collector : ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిష్పక్షపాతంగా ఓటు వినియోగించుకోవాలన్న కలెక్టర్
Continues below advertisement
12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ,దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఎంతో విలువైన ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు.స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రజాస్వామ్య విలువలను చాటుకుంటూ ప్రపంచ దేశాలకు మన దేశం గీటు రాయిగా నిలిచిందన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మన రాజ్యాంగం వీలు కల్పించిందన్నారు. ఓటును నమోదు చేసుకున్నవారందరూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Continues below advertisement